ప్రేక్షకులకు మరో నిరాశ.. చిరంజీవి ఆచార్య సినిమా విడుదల వాయిదా!
- అధికారికంగా ప్రకటించిన సినిమా టీమ్
- కరోనా కారణంగా వాయిదా
- కొత్త తేదీని ప్రకటిస్తామని ట్వీట్
అయితే, ఈ రోజు ఆచార్య సినిమా బృందం తమ అధికారిక ఖాతా ద్వారా స్పందిస్తూ.. 'మహమ్మారి విజృంభణ కారణంగా ఆచార్య సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని తెలిపింది. కాగా, ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు బంగార్రాజు, పుష్ప, అఖండ థియేటర్లలో ఆడుతున్నాయి. పలు చిన్న సినిమాలూ సంక్రాంతికి సందడి చేస్తున్నాయి.