సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు... ఫొటోలు ఇవిగో!
- రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు
- తాడేపల్లిలోనూ వేడుకలు
- సంప్రదాయ దుస్తుల్లో హాజరైన సీఎం జగన్
- రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, గోమాతలకు పూజలు, సంక్రాంతి నృత్యాలు, డప్పు మోతలు, కోలాటాలు, పిండివంటలు... ఇలా సీఎం నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలను ఆస్వాదించిన సీఎం జగన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ శుభం జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.



