పవన్ కల్యాణ్‌కు భార్య అన్నా కొణిదెల స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఏమన్నారంటే?
- 55వ పుట్టినరోజు జరుపుకొంటున్న పవన్ కల్యాణ్
- భర్తకు అన్నా కొణిదెల హృదయపూర్వక విషెస్
- పవన్ ఎంతోమంది హృదయాల్లో ఉన్నారని వ్యాఖ్య
- ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేశావన్న అన్నా
- భర్తతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అన్నా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య అన్నా కొణిదెల ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంతో మంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారని పేర్కొన్నారు. భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
‘‘ఈ రోజు నిన్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నువ్వు ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నావు. ఎంతోమంది జీవితాలను నువ్వు ప్రభావితం చేశావనడానికి ఇది నిదర్శనం. ఇతరులకు ఎంతో ఇచ్చావు. పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ అన్నా పోస్టు చేశారు.
అన్నా పంచుకున్న ఫొటోలో దంపతులిద్దరూ కిటికీ పక్కన కూర్చున్నారు. పవన్ పక్కనే అన్నా కూర్చొని ఆయన వైపు ఆప్యాయంగా చూస్తూ కనిపించారు. ఈ పోస్టు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
పవన్ కల్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జల్సా’, ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతోనూ విజయాలు అందుకున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన శైలి, మేనరిజమ్స్ ఉన్నాయి. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయనకు పుస్తకాలు చదవడం కూడా ఇష్టం.