Raviteja: 'రావణాసుర' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'రావణాసుర'గా రవితేజ
  • ఆసక్తిని పెంచుతున్న కొత్త పోస్టర్
  • ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు
  • సెప్టెంబర్ 30వ తేదీన విడుదల
Ravanasura Release Date Confirmed

రవితేజ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నాడు. ఎంత మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ ఏడాది వరుస సినిమాలను థియేటర్లకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆయన నుంచి 'ఖిలాడి' .. 'రామారావు ఆన్ డ్యూటీ' .. 'ధమాకా' .. ' రావణాసుర' సినిమాలు రానున్నాయి.

ఆ సినిమాల్లో 'రావణాసుర' సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రవితేజ కొత్త పోస్టర్ ను వదిలారు. గాయాలతోనే రవితేజ సిగార్ వెలిగిస్తున్న ఈ పోస్టర్ .. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అభిషేక్ పిక్చర్స్ వారితో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇందులో సుశాంత్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.  ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News