బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి.. కోస్తాకు నేడు భారీ వర్ష సూచన
- కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం
- శనివారం వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
- నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
అలాగే, కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపటి వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఇక, బంగాళాఖాతంలో తూర్పు గాలులు బలంగా వీస్తుండడంతో నిన్న కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శృంగవరపు కోటలో 9, పార్వతీపురంలో 8, పొన్నూరు, మంగళగిరి, గొలుగొండ్లలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్టణంలోనూ గత రాత్రి భారీ వర్షం కురిసింది.