బాలీవుడ్ నటుడు హీరోగా అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్
- అంధుడైనా స్వయంశక్తితో ఎదిగిన శ్రీకాంత్ బొల్లా
- బొల్లాంట్ ఇండస్ట్రీస్ తో ఉన్నతస్థాయికి చేరిన వైనం
- తుషార్ హిద్రానీ దర్శకత్వంలో బయోపిక్
- శ్రీకాంత్ బొల్లా పాత్రను పోషిస్తున్న రాజ్ కుమార్ రావ్
శ్రీకాంత్ బొల్లా బయోపిక్ నిర్మించేందుకు చాక్ అండ్ చీజ్ ఫిలిం ప్రొడక్షన్స్, టీ సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత భూషణ్ కుమార్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో శ్రీకాంత్ బొల్లా పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ పోషిస్తున్నారు. ఈ బయోపిక్ కు తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు.