లక్నో ఐపీఎల్ టీమ్ కు మంచి పేరుంటే సూచించరూ..?: ఫ్రాంచైజీ పిలుపు
- అధికారికంగా ట్విట్టర్ పేజీ ప్రారంభం
- పేరులోనే సమస్తం ఉంది
- షేక్ స్పియర్ మాట వినొద్దంటూ పోస్ట్
ఈ నేపథ్యంలో తమ జట్టుకు మంచి పేరును సూచించాలంటూ పోస్ట్ ద్వారా పిలుపునిచ్చింది. ‘షేక్ స్పియర్ మాట వినొద్దు. పేరులో అన్నీ ఉన్నాయి. ఒక పేరు కోసమే మేము వేచి చూస్తున్నాం’ అంటూ పోస్ట్ లో లక్నో జట్టు పేర్కొంది. ‘పేరులో ఏముంది? గులాబీని మరో పేరుతో పిలిచినా అంతే మధురమైన పరిమళాలను వెదజల్లుతుంది కదా’’ అన్నది షేక్ స్పియర్ కొటేషన్.
‘పేరులో ఏముంది? అంటే అన్నీ వున్నాయి అనే చెప్పాలి. మా గురించి ఆలోచించాల్సిన సమయం ఇదే. ఎందుకంటే లక్నో టీమ్ కు పేరు పెట్టే అవకాశం మీ ముందుంది. మీరు చేయాల్సిందల్లా అందుకోసం ఇక్కడ క్లిక్ చేయడమేనంటూ https://www.officiallucknowiplteam.com/ వెబ్ సైట్ చిరునామా ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం చక్కని పేరును సూచిస్తే ఆ క్రెడిట్ జీవితాంతం మిగిలిపోతుంది కదా.