మరో రీమేక్ కి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్?

Pavan Kalyan In Samudrakhani movie
  • రీమేక్ గా వచ్చిన 'వకీల్ సాబ్' హిట్
  • 'భీమ్లా నాయక్' కూడా రీమేక్ నే
  • తమిళంలో హిట్ కొట్టిన 'వినోదియ సిత్తం'
  • దర్శకుడిగా సముద్రఖని    
పవన్ కల్యాణ్ మొదటి నుంచి కూడా రీమేక్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూనే వస్తున్నారు. కథ .. హీరో పాత్ర .. ఆల్రెడీ ఇతర భాషా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం వలన ఆ ప్రాజెక్టుపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంతకన్నా బాగా ఎలా చేయవచ్చనే ఒక ఆలోచన ఉంటుంది. ఇక ఖర్చు విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంటుంది.

అందువలన పవన్ కథ బాగుంటే చాలు .. తెలుగు రీమేక్ చేయడానికి వెనుకాడరు. ఆల్రెడీ ఆయన చేసిన 'వకీల్ సాబ్' .. ఇప్పుడు చేస్తున్న 'భీమ్లా నాయక్' రెండు సినిమాలు కూడా రీమేక్ నే. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సముద్రఖని.

తెలుగులో విలన్ పాత్రలతో పాప్యులారిటీని పెంచుకుంటున్న సముద్రఖని, తమిళంలో మంచి దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల అక్కడ వచ్చిన 'వినోదియ సిత్తం' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను సముద్రఖని చూపించడంతో, ఆయన దర్శకత్వంలో ఆ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ అంగీకరించారని అంటున్నారు.  
Go Back to Shorts
Pavan kalyan
Samudrakhani
Vinodiya Sittham Movie

More Telugu News