Prabhas: 'రాధేశ్యామ్' ఫస్టు సింగిల్ కి ముహూర్తం ఖరారు!

RadheShyam first song releasing on 15th November
షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' రూపొందింది. టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నెమ్మదిగా ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలను వదలడం పెంచుతూ వెళుతున్నారు.

ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన, పాటలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫస్టు సింగిల్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫస్టు సాంగ్ వదలనున్నట్టు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.

'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇక వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం కావడం మరింత ఆత్రుతను పెంచుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారు.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde

More Telugu News