నన్నెవరూ తొలగించలేదు... నేనే పిటిషన్ వేశాను: సమీర్ వాంఖడే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్నెవరూ తొలగించలేదు... నేనే పిటిషన్ వేశాను: సమీర్ వాంఖడే

Sameer Wankhede says no removal from probe
  • ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామాలు
  • వాంఖడేను విచారణ బాధ్యతల నుంచి తప్పించిన ఎన్సీబీ!
  • కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కోరినట్టు వాంఖడే వెల్లడి
  • ఇకపై సిట్ దర్యాప్తు చేస్తుందని వివరణ
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్యన్ ఖాన్ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సమీర్ వాంఖడే స్పందించారు. తనను ఎవరూ ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈ కేసు విచారణ జరిపించాలని కోరుతూ తానే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశానని సమీర్ వాంఖడే వెల్లడించారు. ఇకపై ఈ కేసును ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.
Sameer Wankhade
Aryan Khan
Drugs Case
Probe
NCB

More Telugu News