Chiranjeevi: దీపావళి సందడిలో 'ఆచార్య' నీలాంబరి!

Acharya song  promo released
షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా కొరటాల వినోదం .. సందేశం కలగలిసిన కథాకథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అపజయమెరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఆచార్య' సినిమా రూపొందింది. చిరంజీవి - కాజల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో, మరో జోడీగా చరణ్ - పూజ హెగ్డే కనిపించనున్నారు.

ఆశయాన్ని సాధించాలంటే ఆవేశం ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. చరణ్ - నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను, ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా 'నీలాంబరి' సాంగ్ ను రేపు వదలనున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ఆ సాంగ్ ప్రోమోను కొంతసేపటి క్రితం వదిలారు. "నీలాంబరి .. నీలాంబరి వేరెవ్వరే నీలా మరి .. నీ అందమే నీ అల్లరి" అంటూ ఈ పాట సాగుతోంది. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ ఈ పాటకి హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. మణిశర్మ బ్యూటిఫుల్ మెలోడీస్ లో ఈ పాటకి చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది.

Go Back to Shorts
Chiranjeevi
Kajal Agarwal
Ramcharan
Pooja Hegde

More Telugu News