Rabada: బంగ్లాదేశ్ టాపార్డర్ ను కకావికలం చేసిన సఫారీ బౌలర్లు... నిప్పులు చెరిగిన రబాడా

  • అబుదాబిలో దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
  • టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
  • మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
  • 45 పరుగులకే 6 వికెట్లు డౌన్
  • రబాడాకు 3 వికెట్లు
Rabada  on fire as Bangladesh lost six wickets

టీ20 వరల్డ్ కప్ లో నేడు గ్రూప్-1లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ సఫారీ బౌలర్లు విజృంభించారు. దాంతో బంగ్లాదేశ్ 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 23 పరుగుల వ్యవధిలో బంగ్లా జట్టు ఈ ఐదు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ టాపార్డర్ హడలిపోయింది. రబాడా 3 వికెట్లు తీయగా, నోర్జే, ప్రిటోరియస్, షంసీ తలో వికెట్ తీశారు.

More Telugu News