సినీ నటుడు నాగశౌర్య విల్లాపై పోలీసుల దాడులు.. పేకాట ఆడుతున్న పలువురి అరెస్ట్
- హైదరాబాద్ శివారులోని మంచిరేవుల వద్ద నాగశౌర్య విల్లా
- బర్త్ డే పార్టీ కోసం అద్దెకు తీసుకుని పేకాట స్థావరంగా మార్చిన వైనం
- 25 మంది అరెస్ట్.. రూ. 6.7 లక్షల నగదు స్వాధీనం
మొత్తంగా 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకున్నారు.
కాగా, ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలుసా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంచితే, పోలీసుల రాకను గుర్తించిన కొందరు తప్పించుకునేందుకు మద్యం సీసాలను వారిపైకి విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.