'రాధే శ్యామ్' నుంచి పూజ హెగ్డే బర్త్ డే పోస్టర్ రిలీజ్!

Radheshyam new poster released
  • విడుదలకి సిద్ధమైన 'రాధే శ్యామ్'
  • ప్రేరణ పాత్రల్లో పూజ అందాల అల్లరి
  • కీలకమైన పాత్రలో భాగ్యశ్రీ
  • జనవరి 14వ తేదీన విడుదల  
ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా .. రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధే శ్యామ్' రూపొందింది. టి-సిరీస్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. విదేశీ నేపథ్యంలో .. పునర్జన్మల చుట్టూ అల్లుకున్న ఈ కథను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున పూజ హెగ్డే పుట్టినరోజు కావడంతో, ఆమెకి విషెస్ తెలియజేస్తూ .. అదే విధంగా ఆమె పాత్ర పేరు 'ప్రేరణ'ను మరోసారి గుర్తుచేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో పూజ గ్రాండియర్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె నాజూకుతనాన్ని ఈ పోస్టర్ అందంగా ఆవిష్కరించింది. ప్రేరణ పాత్ర తన కెరియర్లోనే ప్రత్యేకమైనదని పూజ చెబుతుండటం విశేషం. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రను పోషించగా,  మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారు..
Go Back to Shorts
Prabhas
Pooja Hegde

More Telugu News