MAA: అరగంట ముందే ప్రారంభమైన 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు

MAA elections counting starts
షార్ట్స్‌లో చూడండి
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అరగంట ముందే ఓట్ల లెక్కింపు షురూ చేశారు. గత మా ఎన్నికలకు భిన్నంగా ఈసారి అత్యధిక సంఖ్యలో ఓట్లు పోలవడంతో  ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ప్యానెల్ సభ్యులకు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు అనుమతిస్తున్నారు.

సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో మంచు విష్ణుదే విజయం అని స్పష్టం చేశారు. విష్ణు 80 నుంచి 100 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని పేర్కొన్నారు. 'మా' ఎన్నికల్లో ఈసారి సైలెంట్ ఓటింగ్ జరిగిందని అన్నారు. భారీ ఓటింగ్ తో విష్ణు ప్యానెల్ కే అనుకూలమని నరేశ్ అభిప్రాయపడ్డారు. విష్ణు ప్యానెల్ కోసం వ్యూహాత్మకంగా పనిచేశామని, విష్ణు కోసం దూరప్రాంతాల నుంచి ఓటేయడానికి వచ్చారని వివరించారు.
Go Back to Shorts
MAA
Elections
Counting
Votes
Tollywood

More Telugu News