షార్జాలో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

KKR Vs RR in Sharjah
  • ఐపీఎల్ లో నేడు రెండో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • రాజస్థాన్ జట్టులో నాలుగు మార్పులు
  • ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు ఇరుజట్ల పోరాటం
ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లకు ఇది ఎంతో కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని కోల్ కతా, రాజస్థాన్ భావిస్తున్నాయి.

ఈ పోరు కోసం రాజస్థాన్ జట్టులో నాలుగు మార్పులు చేశారు. క్రిస్ మోరిస్, లివింగ్ స్టన్, అనుజ్ రావత్, ఉనద్కట్ జట్టులోకి వచ్చారు. అటు, కోల్ కతా జట్టులో టిమ్ సౌథీ స్థానంలో లాకీ ఫెర్గుసన్ కు స్థానం కల్పించారు. కాగా, బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ 8, శుభ్ మాన్ గిల్ 9 పరుగులతో ఆడుతున్నారు.
Go Back to Shorts
KKR
RR
Sharjah
IPL

More Telugu News