షారుఖ్ కుమారుడు రెగ్యులర్‌గా డ్రగ్స్ ఆర్డర్లు ఇచ్చేవాడా?
- వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు వెల్లడి
- వైద్య పరీక్షల అనంతరం అరెస్టు చేసిన ముగ్గురిలో ఆర్యన్ ఖాన్
- ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీ
విచారణ సందర్భంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను చెక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం, ఆర్యన్ తరచూ డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చేవాడని తెలుస్తోంది. ముంబైలోని జేజే ఆసుపత్రిలో నిందితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఆర్యన్ కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కుమారుడు అరెస్టవడంపై షారుఖ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.