సాయితేజ్ డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం: వైష్ణ‌వ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయితేజ్ డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం: వైష్ణ‌వ్ తేజ్

sai tej will discharge says vaishnav
  • కొండపొలం సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్న వైష్ణ‌వ్ తేజ్
  • సాయి తేజ్‌ ఆరోగ్యం బాగుంద‌ని వ్యాఖ్య‌
  • సాయితేజ్‌కు ప్రస్తుతం ఫిజికల్ థెరపీ  
సినీ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం గురించి ఆయ‌న సోద‌రుడు వైష్ణవ్ తేజ్ స్పందించాడు. ప్ర‌స్తుతం కొండపొలం సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్న వైష్ణ‌వ్ తేజ్ ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... సాయి తేజ్‌ ఆరోగ్యం బాగుంద‌ని, ఆయ‌న కోలుకుంటున్నాడని చెప్పాడు.

సాయితేజ్‌కు ప్రస్తుతం ఫిజికల్ థెరపీ జరుగుతోందని, వారం రోజుల్లో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివ‌రించాడు. కాగా, కొన్ని రోజుల క్రితం సాయి ధ‌ర‌మ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కు గురైన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు చికిత్స అందుతోంది. ఆయ‌న న‌టించిన రిప‌బ్లిక్ సినిమా కూడా మూడు రోజుల క్రిత‌మే విడుద‌లైంది.
Sai Dharam Tej
vaishnav tej
Tollywood

More Telugu News