Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantha reacts on rumors
షార్ట్స్‌లో చూడండి
*  తన వ్యక్తిగత జీవితంపై ఇటీవల వస్తున్న వదంతులకు అందాలతార సమంత చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ, తాను ముంబైకి మకాం మారుస్తున్నట్టు వస్తున్న వదంతులను ఖండించింది. 'ఇలాంటి రూమర్లు ఎలా వస్తాయో తెలియదు.. హైదరాబాద్ నా ఇల్లు.. నేను ముంబైకి మారడం లేదు.. ఎప్పటికీ ఇక్కడే వుంటాను' అంటూ స్పష్టం చేసింది.  
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటించే సినిమాలో నేచురల్ స్టార్ నాని విలన్ గా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో విలన్ పాత్రలో నాని నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగును అక్టోబర్ 15న ప్రారంభిస్తారు.
*  అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి దీనికి U/A సర్టిఫికెట్ లభించింది. కాగా, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Samantha
Vijay
Nani
Pooja Hegde
Akhil

More Telugu News