Corona Virus: దేశంలో కొత్త‌గా 18,795 క‌రోనా కేసుల న‌మోదు

  • మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581
  • నిన్న‌ 179 మంది క‌రోనాతో మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,47,373
  • కేర‌ళ‌లో నిన్న‌ 11,699 క‌రోనా కేసులు
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్త‌గా 18,795 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581కు చేరింది. నిన్న‌ 26,030 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 32,9,58,002కు చేరింది. అలాగే, నిన్న‌ 179 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,47,373కు చేరింది.

ఇక 2,92,206 మందికి ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. మ‌రోవైపు, కేర‌ళ‌లో నిన్న‌ 11,699 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, ఆ రాష్ట్రంలో నిన్న 58 మంది మృతి చెందారు. నిన్న దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,02,22,525 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 87,07,08,636 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

More Telugu News