ప్లే ఆఫ్ ఆశల్లేవ్... ఇవాళ సన్ రైజర్స్ ఏం చేస్తుందో?
- నేడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- పాయింట్ల పట్టికలో అట్టడుగున సన్ రైజర్స్
- 9 మ్యాచ్ ల్లో ఒక్క విజయం
ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 4 ఓవర్లు ముగిసిన అనంతరం ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ఓపెనర్ జైశ్వాల్ (21), కెప్టెన్ సంజు శాంసన్ (6) క్రీజులో ఉన్నారు.
గత మ్యాచ్ లలో వరుసగా ఓటమిపాలైన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ తోనైనా ఆ పరంపరకు అడ్డుకట్ట వేస్తుందా? లేక ప్రత్యర్థికి మరోసారి దాసోహం అంటుందా? చూడాలి.