Bellamkonda Ganesh: 'స్వాతి ముత్యం'గా బెల్లంకొండ గణేశ్ .. ఫస్టులుక్

Swathimuthyam first look poster released
షార్ట్స్‌లో చూడండి
బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేశ్ కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది.

ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ రోజున బెల్లంకొండ గణేశ్ పుట్టినరోజు కావడంతో టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి 'స్వాతిముత్యం' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చాలా సింపుల్ లుక్ తో గణేశ్ ఆకట్టుకుంటున్నాడు.

ఈ సినిమాలో ఆయన జోడీగా వర్ష బొల్లమ్మ అలరించనుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మాదిరిగానే, గణేశ్ కూడా హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.
Go Back to Shorts
Bellamkonda Ganesh
Varsha Bollamma
Mahathi Swara Sagar

More Telugu News