Bhola Shankar: విడుదలైన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ లో రికార్డు సృష్టించిన 'భోళా శంకర్'

Chiranjeevi Bhola Shankar title video creates record on Twitter
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం 'భోళా శంకర్' టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే రికార్డుల పర్వం షురూ చేసింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ వీడియోను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఉదయం విడుదల చేశారు. కాగా, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ట్విట్టర్ లో వేగంగా 1 మిలియన్ వ్యూస్ సాధించిన టైటిల్ వీడియోగా చిరంజీవి 'భోళా శంకర్' కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ వెల్లడించింది.

తమిళంలో అజిత్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టయిన వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోంది. వేదాళంలో అజిత్, లక్ష్మీమీనన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించగా, తెలుగులో చిరంజీవి, కీర్తి సురేశ్ ఆ పాత్రల్లో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Go Back to Shorts
Bhola Shankar
Title Video
Chiranjeevi
Record
Twitter

More Telugu News