Sri Vishnu: 'రాజ రాజ చోర' నచ్చిందన్న రవితేజ!

Raviteja Appreciated Raja Raja Chora movie
షార్ట్స్‌లో చూడండి
శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'రాజ రాజ చోర', ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హసిత్ గోలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా మేఘ ఆకాశ్ అలరించింది. మరో కథానాయికగా సునైన ఆకట్టుకుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తొలి రోజున తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, అదే ఊపుతో కొనసాగుతోంది. ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా, ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో రవితేజ కూడా చేరిపోయాడు.

'రాజ రాజ చోర' సినిమాను చూశాను .. చాలా సరదాగా .. సందడిగా ఉంది. మొదటి నుంచి చివరి వరకూ నవ్వించింది .. అక్కడక్కడా ఎమోషన్ కి గురిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చేసింది. శ్రీవిష్ణు చాలా బాగా చేశాడు .. హసిత్ గోలి ఒక మంచి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతటి వినోదాన్ని అందించిన టీమ్ కి అభినందనలు" అని చెప్పుకొచ్చాడు.  
Go Back to Shorts
Sri Vishnu
Megha Akash

More Telugu News