Sathyadev: సత్యదేవ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం!

  • 'తిమ్మరుసు' సెట్స్ పైకి సత్యదేవ్
  • దిల్ రాజు క్లాప్ తో మొదలైన షూటింగ్
  • స్క్రిప్ట్ ను అందజేసిన కొరటాల
  • కెమెరా స్విచ్చాన్ చేసిన హరీశ్ శంకర్  
  • కొత్త దర్శకుడి పరిచయం
Sathyadev new movie started

మొదటి నుంచి కూడా సత్యదేవ్ విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. చిన్న చిన్న పాత్రల నుంచి ఆయన హీరో స్థాయికి చేరుకున్నాడు. 'బ్లఫ్ మాస్టర్' '.. ' ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' నటుడిగా ఆయన సత్తాను చాటిచెప్పాయి. ఇటీవల విడుదలైన 'తిమ్మరుసు' సినిమా కూడా ఫరవాలేదనిపించుకుంది.

ఆయన కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి 'దిల్' రాజు .. కొరటాల .. హరీశ్ శంకర్ హాజరయ్యారు. కెరియర్ పరంగా సత్యదేవ్ కి ఇది 25వ సినిమా. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయమవుతుండగా, కాలభైరవ సంగీతాన్ని అందించనున్నాడు.

అరుణాచల క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్క్రిప్ట్ ను కొరటాల తన చేతుల మీదుగా దర్శకుడికి అందజేశారు. హరీశ్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సత్యదేవ్ పై దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు షాట్ చిత్రీకరణ మొదలైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News