Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Meharinin Kannada movie opposite Shiv Raj Kumar
షార్ట్స్‌లో చూడండి
*  తన వివాహాన్ని రద్దు చేసుకున్న తర్వాత నుంచీ కథానాయిక మెహ్రీన్ సినిమాలలో బిజీ అవుతోంది. వివిధ భాషలలో సినిమాలను అంగీకరిస్తూ సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా తొలిసారిగా ఓ కన్నడ సినిమాలో కూడా నటిస్తోంది. శివరాజకుమార్ హీరోగా రామ్ ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సిగువరేగు' చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. మరోపక్క, తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది.
*  మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిరంజీవి జన్మదినం ఆగస్టు 22న ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
*  కథానాయిక నయనతార మరో మలయాళ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. 'ప్రేమమ్' ఫేమ్ ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ హీరోగా రూపొందే చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.
Go Back to Shorts
Mehrin
Chiranjeevi
Koratala Siva
Nayanatara

More Telugu News