Kiran Abbavaram: 'ఆహా'లో 'SR కల్యాణ మండపం'

  • ఈ నెల 6న థియేటర్లకు వచ్చిన సినిమా
  • కిరణ్ అబ్బవరం జోడీగా ప్రియాంక జవాల్కర్ 
  • కీలకమైన పాత్రలో సాయి కుమార్ 
  • త్వరలోనే 'ఆహా' ద్వారా స్ట్రీమింగ్
SR Kalyana Mandapam will release in OTT soon

కిరణ్ అబ్బవరం - ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందిన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం' సినిమా, ఈ నెల 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సాయికుమార్ కీలకమైన పాత్రను పోషించారు. నిర్మాతలు ప్రమోద్ - రాజు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.

ఆ వారంలో విడుదలైన సినిమాల్లో ఇదే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అయితే అదే ఊపును మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తుందనే దర్శక నిర్మాతల అంచనాలు తప్పాయి. కొద్దిపాటి లాభాలతో సినిమా ఓకే అనిపించుకుందట. ఆ సినిమాను ఇప్పుడు ఓటీటీ ద్వారా వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా ఓటీటీ హక్కులు 'ఆహా' వారు తీసుకున్నారట. సాధ్యమైనంత త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారని అంటున్నారు. 'ఆహా' నుంచి స్ట్రీమింగ్ డేట్ రానున్నట్టుగా చెబుతున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమా 'ఆహా' ద్వారా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.  

More Telugu News