Vishwak Sen: నిజమైన ప్రేమను గెలిచే ప్రయత్నమే 'పాగల్' .. ట్రైలర్ రిలీజ్!

  • విష్వక్ సేన్ నుంచి  'పాగల్'
  • ముగ్గురు కథానాయికలు
  • దర్శకుడిగా నరేశ్ కుప్పిలి పరిచయం
  • ఈ నెల 14వ తేదీన విడుదల  
paagal trailer released

విష్వక్సేన్ హీరోగా 'పాగల్' నిర్మితమైంది. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఎవరికి పడితే వాళ్లకి ఐ లవ్ యు చెబుతూ ఉంటాడు. అలాటి హీరో ఒక యువతిని మాత్రం నిజంగానే లవ్ చేస్తాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ అమ్మాయి 'నో' చెబుతుంది. ఆ తర్వాత ఆమె ప్రేమను పొందడానికి అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

లవ్  .. కామెడీతో పాటు ఈ సినిమాలో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు యూత్ ను .. అటు మాస్ ను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ కథను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. రధన్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా మారుతుందని అనుకోవచ్చు. నివేద పేతురాజ్ తో పాటు కథానాయికలుగా సిమ్రన్ .. మేఘలేఖ కనువిందు చేయనున్నారు. 

More Telugu News