'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు' అంటోన్న ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరుడు' ప్రోమో విడుదల
- షోకి హోస్టుగా ఎన్టీఆర్
- రండి గెలుద్దాం అంటోన్న ఎన్టీఆర్
- ఈ నెల నుంచే షో ప్రారంభం
'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మరో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఈ ఆగస్టులోనే ఈ షో గర్జిస్తుందని జెమినీ టీవీ పేర్కొంది. గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రాంతో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు.