సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- త్రిష పెళ్లి వార్తలపై వివరణ
- 'గాడ్ ఫాదర్'గా మెగాస్టార్?
- తేజ సినిమాలో సముద్రఖని
* మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 12 నుంచి జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ని ఖరారు చేసే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
* రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందే ఓ లవ్ స్టోరీ ద్వారా అభిరామ్ హీరోగా కెరీర్ని మొదలుపెడుతున్నాడు. ఇక ఇందులో ప్రధాన విలన్ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఎంపికైనట్టు సమాచారం.