సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వచ్చే నెల నుంచి తమన్నా టీవీ షో
- చైతూతో తరుణ్ భాస్కర్ సినిమా
- శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'అన్నాయ్'
* అక్కినేని నాగ చైత్యన్య హీరోగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు. ఇప్పటికే ఈ చిత్రకథను నిర్మాత ఓకే చేసినట్టు సమాచారం.
* తాజాగా 'నారప్ప' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల త్వరలో గీతా ఆర్ట్స్ నిర్మించే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం పేరు 'అన్నాయ్'. మూడు భాగాలుగా తెరకెక్కించే ఈ చిత్రం గుంటూరు ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్రధానంగా నడుస్తుందట.