Trivikram Srinivas: త్రివిక్రమ్ చేతుల మీదుగా సిద్ధు చిత్రం ప్రారంభం!

  • హీరోగా సిద్ధు నుంచి మరో చిత్రం 
  • పూజా కార్యక్రమాలు పూర్తి
  • కొత్త దర్శకుడికి ఛాన్స్ 
  • వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్
Trivikram lainched Siddhu latest movie

సిద్ధు జొన్నలగడ్డ నటుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టి కొంతకాలమవుతోంది. తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలను చేస్తూ వెళ్లిన సిద్ధు, ఆ తరువాత హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన హీరోగా ఒక సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ తన చేతుల మీదుగా స్క్రిప్ట్ ను ఈ సినిమా దర్శకుడు శౌరి చంద్రశేఖర్ కి అందించారు. దేవుడి పటాలపై త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శౌరి చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరోగా సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న ఈ సినిమాలో, తమిళ నటుడు అర్జున్ దాస్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. స్వీకార్ అగస్తి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ అనీ, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు చెప్పారు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను వెల్లడిస్తామని అన్నారు. 'గుంటూరు టాకీస్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు, ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

More Telugu News