'నారప్ప'కి లైన్ క్లియర్ .. వచ్చేనెలలోనే రిలీజ్?
- 'అసురన్' రీమేక్ గా 'నారప్ప'
- అమెజాన్ ప్రైమ్ కి అమ్మకం
- వచ్చేనెల 24వ తేదీన విడుదల
- హాట్ స్టార్ కి 'దృశ్యం 2'
- ఆగస్టులో రిలీజ్ చేసే అవకాశం
అయితే 'నారప్ప' ఓటీటీలో రావడమనేది ఖరారైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వారికి మంచి రేటుకు ఈ సినిమాను అమ్మినట్టుగా చెబుతున్నారు. జులై 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇక 'దృశ్యం 2' సినిమాను హాట్ స్టార్ వారు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. నెల తేడాతోనే వెంకటేశ్ సినిమాలు రెండూ పలకరిస్తూ ఉండటం విశేషమే.