సుకుమార్ చేతుల మీదుగా 'సిగ్గెందుకురా మావ' సాంగ్!
- తెలుగు తెరకు మరో ప్రేమకథ
- కిరణ్ జోడీగా ప్రియాంక జవాల్కర్
- దర్శకుడిగా శ్రీధర్ పరిచయం
- త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
అందమైన అమ్మాయిల వెంటపడినప్పుడు వాళ్లు తిడుతుంటారు .. అయినా పట్టించుకోకుండా .. సిగ్గును మడిచేసి జేబులో పెట్టేసుకుని ఫాలో కావలసిందే అనే అర్థంలో ఈ పాట సాగుతోంది. ఓ కుర్రాడికి ప్రేమపై గల అభిప్రాయాన్ని తేలికైన పదాలతో భాస్కరభట్ల చెప్పిన తీరు బాగుంది. అనురాగ్ కులకర్ణి ఆలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాపై ప్రియాంక జవాల్కర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారట. యూత్ ను ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.