తెలంగాణ భావజాల వ్యాప్తిలో గూడ అంజయ్య ఎంతో కృషి చేశారు: సీఎం కేసీఆర్
- వర్ధంతి సందర్భంగా నివాళులు
- పాటతో చైతన్యం రగిల్చారని కామెంట్
- ఆయన ఆశయాలను నిజం చేస్తున్నామన్న సీఎం
స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలన్న అంజయ్య ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తోందన్నారు. అందుకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అందిస్తున్నామన్నారు. తద్వారా తెలంగాణలోని సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని, అదే అంజయ్యకు ఘన నివాళి అని చెప్పారు.