ఎన్టీఆర్ జోడీగా కియారా అద్వాని .. పారితోషికం 3 కోట్లు?
- బాలీవుడ్ లో బిజీ హీరోయిన్
- తెలుగులోను క్రేజ్
- ఎన్టీఆర్ జోడీగా ఛాన్స్
- కొరటాల సినిమాకి గ్రీన్ సిగ్నల్
అయితే ఇటీవల ఆమె దక్షిణాదిన ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో శంకర్ - చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనుందంటూ ప్రచారం జరిగింది. అలాగే ఎన్టీఆర్ - కొరటాల సినిమాలో చేయనుందని కూడా చెప్పుకున్నారు. అయితే, ఎన్టీఆర్ జోడీగానే ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం ఆమె అందుకుంటున్న పారితోషికం 3 కోట్లు అని అంటున్నారు. పూజ హెగ్డే .. రష్మిక తీసుకునే పారితోషికం కంటే ఇది చాలా ఎక్కువ కావడంతో హాట్ టాపిక్ గా మారింది.