ఎమ్మెల్సీలుగా నియమితులైన ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి: వర్ల రామయ్య
- గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటా ఫైలుకు గవర్నర్ ఆమోద ముద్ర
- తోట త్రిమూర్తులుపై 20 నెలలుగా విచారణ
- హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న రమేశ్ యాదవ్
- గవర్నర్‌కు రాసిన లేఖలో వర్ల రామయ్య ఆరోపణ
ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు 20 నెలులగా విచారణ ఎదుర్కొంటున్నారని, ఆయనపై పలు క్రిమినల్ కేసులు కూడా పెండింగులో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా పోలీసు రికార్డుల్లో నమోదై ఉందని తెలిపారు. ఓ హత్య కేసులో రమేశ్ యాదవ్ విచారణను ఎదుర్కొంటున్నారని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.