అల్లు శిరీష్ బర్త్ డే కానుకగా రానున్న ఫస్టులుక్!

Allu Sirish upcoming movie pre look
  • గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో లవ్ స్టోరీ
  • అల్లు శిరీష్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్
  • త్వరలోనే పూర్తి వివరాలు
అల్లు శిరీష్ .. హీరోగా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చేసి ఏడేళ్లు దాటేసింది. ఈ ఏడేళ్లలో ఆయన అరడజనులోపు సినిమాలు చేశాడు. నిజానికి ఆయన దృష్టి పెడితే వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లొచ్చు. అయినా ఆయన సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ తీసుకుంటూ, తనకి బాగా నచ్చిన కథలు మాత్రమే చేస్తూ వెళుతున్నాడు. 'ఏబీసీడీ' తరువాత ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు .. ఇది శిరీష్ కి 6వ సినిమా.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శిరీష్ జోడిగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. ఈ రోజున ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. రేపు శిరీష్ పుట్టినరోజు కావడంతో, ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నామనే విషయాన్ని ప్రీ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Go Back to Shorts
Allu Sirish
Anu Emmanuel
GA2 Pictures

More Telugu News