VH: కేసీఆర్ ను కలవడానికి వచ్చిన వీహెచ్‌.. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఆరోపణ!

vh slams kcr
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ఈ రోజు ఉద‌యం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు వ‌చ్చారు. అయితే, కేసీఆర్‌ను క‌లుద్దామంటే ఆయ‌న అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిప‌డ్డారు.

తెలంగాణ‌లో కరోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన‌ వారికి రెండు లక్షల రూపాయ‌ల చొప్పున‌ ఆర్థిక సాయం అందించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ సమస్యలపై కేసీఆర్‌కు తాము ఎన్ని లేఖలు రాసినప్ప‌టికీ స్పందన రావ‌ట్లేద‌ని హ‌నుమంత‌రావు మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ తాను సమస్యలపై పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు.
Go Back to Shorts
VH
Congress
KCR
TRS

More Telugu News