మాది ఉమ్మడి కుటుంబం.. 10 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది: 'ఖిలాడీ' సినిమా హీరోయిన్ డింపుల్ హయతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాది ఉమ్మడి కుటుంబం.. 10 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది: 'ఖిలాడీ' సినిమా హీరోయిన్ డింపుల్ హయతి

dimple hayati breaks down
  • వారం రోజులుగా శారీరకంగా, మానసికంగా  కష్టాలు
  • కుటుంబ స‌భ్యుల‌ పరిస్థితి చాలా బాధాక‌రం
  • తాతయ్యకు ఐసీయూలో  చికిత్స  
త‌మ‌ది ఉమ్మడి కుటుంబం అని, త‌మ‌ ఇంట్లో 10 మందికి కరోనా సోకింద‌ని 'ఖిలాడీ' సినిమాలో రవితేజ సరసన నటిస్తున్న హీరోయిన్ డింపుల్ హయతి భావోద్వేగ‌భ‌రిత పోస్ట్ చేసింది. క‌రోనాతో బాధ‌ప‌డుతోన్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ ఒత్తిడిని తగ్గించేందుకు చాలా ప్రయత్నిస్తున్నామ‌ని చెప్పింది.

వారం రోజులుగా శారీరకంగా, మానసికంగా కష్టాల‌ను ఎదుర్కోవాల్సి వస్తోంద‌ని ఆమె పేర్కొంది. త‌మ కుటుంబ స‌భ్యుల‌ పరిస్థితి చాలా బాధాక‌రంగా ఉందని చెప్పింది.  తన తాతయ్య కూడా ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.  కాగా, షూటింగులు, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రస్తుతం డింపుల్ హ‌యతి హైదరాబాద్‌లోనే ఉంటోంది.  తన కుటుంబ సభ్యులు క‌రోనాతో బాధ‌ప‌డుతోన్న స‌మయంలో వారి వెంట లేనందుకు బాధపడుతోంది.  
dimple
khiladi
Raviteja
Tollywood

More Telugu News