Chandrababu: క‌డ‌ప జిల్లాలో పేలుడు ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాలి: చంద్ర‌బాబు

chandrababu slams ysrcp
షార్ట్స్‌లో చూడండి
క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా పేలుడు సంభ‌వించి తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రికొంత‌మందికి గాయాలైన‌ విష‌యం తెలిసిందే.

టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు దీనిపై స్పందిస్తూ.. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క‌డ‌ప పేలుడు ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News