సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నాగార్జున సరసన బాలీవుడ్ భామ
- మహేశ్ షూటింగ్ ఇక అప్పుడే!
- ఓటీటీ ప్రారంభించిన ప్రముఖ నటి
* మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ జులై నుంచి మొదలవుతుంది. అప్పటికి కొవిడ్ ప్రభావం తగ్గుతుంది కాబట్టి, జులైలో షూటింగ్ మొదలుపెడదామని మహేశ్ దర్శక నిర్మాతలకు చెప్పాడట. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
* తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించిన కథానాయిక నమిత తాజాగా వ్యాపారంలోకి కూడా దిగింది. సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. దీని పేరు 'నమిత థియేటర్'. దీని ద్వారా ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన కంటెంట్ ను అందిస్తామని నమిత పేర్కొంది.