KCR: కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్!

Man posted video against KCT arrested
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మాలకుంటకు చెందిన ధరావత్ శ్రీను నాయక్ అనే యువకుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తొలగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోపై ధర్మాపురం గ్రామ సర్పంచ్ నగేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు, శ్రీను నాయక్ ను అరెస్ట్ చేయడంపై లంబాడీ విద్యార్థి సేన ఆందోళన చేపట్టింది. శ్రీనును విడుదల చేయాలంటూ సూర్యాపేట రూరల్ సీఐకి వినతిపత్రం అందించారు.
KCR
Telangana

More Telugu News