నైట్ రైడర్స్ తో పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ రాజస్థాన్
- బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- పాయింట్ల పట్టికలో చివరన ఉన్న రెండు జట్లు
- ఆసక్తికరంగా నేటి మ్యాచ్!
ఇక, ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ రెండు మార్పులు చేసింది. శ్రేయాస్ గోపాల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్, మనన్న వోరా స్థానంలో జైశ్వాల్ జట్టులోకి వచ్చారు. అటు, కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. కమలేశ్ నాగర్ కోటి స్థానంలో శివం మావి తుదిజట్టుకు ఎంపికయ్యాడు. కాగా నేటి మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది.