సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్వీ రమణ
- మీ అనుభవం దేశానికి ప్రయోజనకరమన్న కేసీఆర్
- మీ పదవీకాలం గొప్పగా ఉండాలని ఆకాంక్ష
మరోవైపు సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టినందుకు శుభాకాంక్షలు అని కేసీఆర్ అన్నారు. మీకున్న విశేషమైన అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. మీ పదవీకాలం చాలా గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.