మెగా మేనల్లుడి కొత్త సినిమా మొదలైంది!
- వైష్ణవ్ తేజ్ పై సాయితేజ్ క్లాప్
- దర్శకుడిగా గిరీశాయ పరిచయం
- కేతిక శర్మకి ఇది మూడవ సినిమా
హీరో వైష్ణవ్ తేజ్ .. హీరోయిన్ కేతిక శర్మపై సాయితేజ్ క్లాప్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ తల్లి విజయదుర్గ కెమెరా స్విచ్చాన్ చేయగా ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంతకుముందు ఈ దర్శకుడు తమిళంలో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా 'ఆదిత్య వర్మ'ను తెరకెక్కించాడు. తెలుగులో భారీ విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాకి అది రీమేక్. ఆ సినిమా అక్కడ ఫరవాలేదనిపించుకుంది. ఇక 'రొమాంటిక్' .. 'లక్ష్య' తరువాత కేతిక శర్మ ఈ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.