Bhuvneshwar Kumar: 'తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతా'.. మ‌హేశ్ బాబు సినిమా డైలాగుతో క్రికెట‌ర్ భువీ పిక్‌!

  • పోస్ట్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్
  • ‘శ్రీమంతుడు’గా భువీ అని పేర్కొన్న టీమ్
  • అచ్చం మ‌హేశ్ బాబును పోలిన పిక్
buvi pic goes viral

మ‌రికొన్ని రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో త‌మ కీల‌క ఆట‌గాడు భువనేశ్వ‌ర్ గురించి చేసిన ట్వీట్ అల‌రిస్తోంది.

మ‌హేశ్ బాబు న‌టించిన శ్రీమంతుడు సినిమాలోని ఓ డైలాగును ఇందులో భువీకి అప్లై చేశారు. హైదరాబాదీ అభిమానులు త‌న‌కు చాలా ప్రేమను పంచార‌ని, పెర్ఫార్మెన్స్‌ రూపంలో తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే లావైపోతాన‌ని భువీ అంటున్నట్లు అందులో పేర్కొన్నారు. టీమ్‌లోకి భువీ ఎప్పుడు వ‌స్తాడా అని ఎదురుచూస్తున్నామ‌ని  సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పేర్కొంది.

‘శ్రీమంతుడు’గా భువీ అని పేర్కొని, అచ్చం మ‌హేశ్ బాబును పోలిన‌ పోస్టర్‌ను రూపొందించింది. కాగా, గ‌తంలో మ‌హేశ్ బాబుతో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోల డైలాగుల‌తో ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా వీడియోలు పోస్ట్ చేసి హైద‌రాబాద్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. అదే టీమ్ నుంచి భువీకి సంబంధించిన ఫొటో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News