మొట్టికాయలు జగన్ కు కొత్త కాదయా: బుద్ధా వెంకన్న
- చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టినప్పుడే.. అది దొంగ కేసు అని తేలిపోయింది
- ఇకపై సన్నబియ్యం డోర్ డెలివరీపై దృష్టి పెట్టండి
- మీ నాన్నకే సాధ్యంకాని పనుల గురించి ఎక్కువగా ఆలోచించకండి
'మొట్టికాయలు జగన్ కు కొత్త కాదయా' అని ఆయన వ్యాఖ్యానించారు. రెడ్డి గారి ఫిర్యాదుతో చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన రోజే... అది దొంగ కేసు అని తేలిపోయిందని అన్నారు. ఇకనుంచి అమరావతిపై విషం కక్కడం, చంద్రబాబుపై కక్షసాధింపులు పక్కనపెట్టి... సన్నబియ్యం డోర్ డెలివరీపై దృష్టి పెడితే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినందుకు కనీస అర్థం ఉంటుందని హితవు పలికారు. మీ నాన్నగారికే సాధ్యం కాని పని గురించి ఎక్కువగా ఆలోచించి తల బొప్పి కట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నానని ట్వీట్ చేశారు.