Sai Pallavi: ‘సారంగ దరియా’ పాటను విడుద‌ల చేసిన‌ స‌మంత.. డ్యాన్సుతో అల‌రిస్తోన్న సాయిప‌ల్ల‌వి

  • ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తోన్న లవ్‌స్టోరి
  • హీరో,  హీరోయిన్లుగా నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి
  • ఏప్రిల్‌ 16న  ‘లవ్‌స్టోరి’ సినిమా విడుద‌ల
saranga daria song releases

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తోన్న ల‌వ్ స్టోరీ సినిమా నుంచి ‘సారంగ దరియా’ పాటను హీరోయిన్ స‌మంత త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసింది. సాయిపల్లవి డ్యాన్సుతో మెస్మరైజ్ చేసింద‌ని సమంత పేర్కొంది. ఈ సినిమాలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో, హీరోయిన్లుగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  

‘సారంగ దరియా’ పాట లిరిక్స్‌తో పాటు సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ అల‌రిస్తోంది. ఇటీవ‌ల ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోలు విడుద‌ల చేసి, దీనిపై ఆసక్తిని పెంచారు. తెలంగాణ  జానపద పాటగా సాగుతోన్న ఈ పాటను మంగ్లీ పాడింది. సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌ అందించారు. ఈ సినిమాకు పవన్‌ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 16న  ‘లవ్‌స్టోరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
  

More Telugu News