బయో ఆసియా స‌ద‌స్సులో స‌త్య‌ నాదెళ్ల‌తో కేటీఆర్ ముఖాముఖి!
Add ap7am to your home Screen

బయో ఆసియా స‌ద‌స్సులో స‌త్య‌ నాదెళ్ల‌తో కేటీఆర్ ముఖాముఖి!

ktr satyanadella participate in bio asia 2021
  • హైద‌రాబాద్ వేదికగా అంతర్జాతీయ సదస్సు
  • కరోనా పరిస్థితుల నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వహ‌ణ‌
  • బ‌యో టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి అవ‌కాశాలు: కేటీఆర్‌
  • వైద్య రంగంలో కృత్రిమ మేధది కీల‌క పాత్ర: స‌త్య నాదెళ్ల‌
హైద‌రాబాద్ వేదికగా ప్ర‌తిష్ఠాత్మ‌క ఆసియా అంతర్జాతీయ సదస్సు-2021 కొన‌సాగుతోంది. కరోనా పరిస్థితుల నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తోన్న ఈ సద‌స్సులో ప్రపంచంలోని 30 వేల మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు వారి దేశాల నుంచి హాజ‌ర‌వుతున్నారు.  

కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల గురించి చెబుతున్నారు. ఈ రోజు ఇందులో  స‌త్య‌నాదెళ్ల‌తో కేటీఆర్ ముఖాముఖిలో మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. బ‌యో టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా స‌త్య‌ నాదెళ్ల‌తో అన్నారు. అయితే, వైద్య రంగంలో డేటా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యత‌ ఇవ్వాలని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా స‌త్య ‌నాదెళ్ల స్పందిస్తూ బ‌యో ఆసియా స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌శంసించారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని తెలిపారు. ఇన్‌పేషెంట్ సేవ‌ల విభాగంలోనూ కృత్రిమ మేధ‌ది కీల‌క పాత్ర అని స‌త్య నాదెళ్ల చెప్పారు. త‌క్కువ ఖ‌ర్చుతో వైద్య సేవ‌లు అందించే ల‌క్ష్యంతో తాము ప‌ని చేస్తున్నామ‌ని స‌త్య‌ నాదెళ్ల తెలిపారు.
KTR
satya nadella
Hyderabad

More Telugu News